రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్

69చూసినవారు
రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్
రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోలో కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లు. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరం తగ్గడంతోపాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది.

సంబంధిత పోస్ట్