'దేవర' ప్రమోషన్స్ లో ఫోటోగ్రాఫర్లను నెట్టవద్దని బాడీగార్డులకు సూచించిన జాన్వీ కపూర్

69చూసినవారు
'దేవర' ప్రమోషన్స్ లో ఫోటోగ్రాఫర్లను నెట్టవద్దని బాడీగార్డులకు సూచించిన జాన్వీ కపూర్
స్టార్ హీరో జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం 'దేవర'. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో జాన్వీ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లను తన సెక్యూరిటీ గార్డులు తోసివేయడం చూసిన ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "వారిని ఎందుకు నెడుతున్నారు. వాళ్ళను వదిలేయండి. వాళ్ళు ఏమీ చేయడం లేదు" అని జాన్వీ చెప్పింది. వారిని విడిచిపెట్టమని ఆమె తన గార్డులను హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్