భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు సోమవారం ప్రకటించింది. త్రిపుర రాజధాని అగర్తలకు చెందిన దీపా 2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆసియన్ గేమ్స్‌లోనూ బంగారు పతకం గెలిచి, అది సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గానూ నిలిచింది. ఇంకా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.