కాంట్రాక్టు సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు వెంకటరెడ్డి అవకాశం కల్పించారు. తద్వారా ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకునేందుకు అవకాశం కల్పించారు. ఒప్పందం ప్రకారం ప్రతినెలా 1, 16వ తేదీల్లో ఆయా ప్రైవేటు సంస్థలు టెండరులో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. పైగా బకాయిలు ఉన్నప్పటికీ ఆయా సంస్థల బ్యాంకు గ్యారంటీల సొమ్ము వెనక్కి తీసుకునేందుకు ఎన్‌ఓసీలు ఇచ్చేశారు.