మోతిలాల్ నాయక్ ను పరామర్శించిన హరీశ్

60చూసినవారు
మోతిలాల్ నాయక్ ను పరామర్శించిన హరీశ్
గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. 'సీఎం స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి. నిరుద్యోగులు తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణంగా స్పందించాలి.రాహుల్ గాంధీకి మా నిరుద్యోగుల బాధలు కనపడడం లేదా? వినపడడం లేదా?' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్