దోమలను తరిమికొట్టేందుకు వాడే లిక్విడ్స్‌లో ప్రాలెథ్రిన్, అలెథ్రిన్ వంటి అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. మస్కిటో లిక్విడ్స్ చర్మం, కళ్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. చాలా మందికి తలనొప్పి, మైకం కలుగుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. పిల్లలు, వృద్ధులకు అలెర్జీలు, శ్వాస సమస్యలు, ఇతర శారీరక సమస్యలు వస్తాయి.