నార్త్ కరోలినాలో ప్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు విశేష ప్రజాదరణ ఉంది. అయితే, ఓ సందర్శకుడు తన మొబైల్ లో రైడ్ ను బంధించాలని ప్రయత్నించగా, దీని పిల్లర్లలో ఒకదానికి పెద్ద బీట వచ్చినట్లు గమనించాడు. ఈ పిల్లర్ కుండా రోలర్ కోస్టర్ వెళ్తే అది కదులుతున్న దృశ్యం కనిపించింది. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేయగా రైడ్ నిలిపేశారు. రోలర్ కోస్టర్ పట్టు తప్పితే పెద్ద ప్రమాదమే జరిగేదని పెను ముప్పు తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.