బీహార్‌లోని సుపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కుముద్ అనే యువకుడు తన భార్య కళ్ళముందే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు, ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో సంచలన విషయాలు బయటకొచ్చాయి. కుముద్ జేబులో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోటులో 'నేను నిన్ను చాలా ప్రేమించాను, నువ్వు నన్ను మోసం చేశావ్.. ప్రియుడితోనే ఉండు అంటూ పేర్కొన్నాడు.