రెండుసార్లు వెన్నుపోటుకు గురైన ఏకైక నాయకుడు

1055చూసినవారు
రెండుసార్లు వెన్నుపోటుకు గురైన ఏకైక నాయకుడు
మొదటిసారి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్టీఆర్ 1984 ఆగస్టులో తన సహచరుడు నాదెండ్ల భాస్కర్‌రావు నుంచి తొలిసారి వెన్నుపోటును ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లగా, అప్పటి గవర్నర్ రాంలాల్ మద్దతుతో నాదెండ్ల భాస్కర్ రావు సీఎం కుర్చి ఎక్కారు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగి మళ్లీ 1985లో అధికారంలోకి వచ్చారు. 1995లో చంద్రబాబు నాయుడు రూపంలో మరోసారి వెన్నుపోటుకు గురయ్యారు. ఫలితంగా దేశంలోనే రెండుసార్లు వెన్నుపోటుకు గురైనా ఏకైక సీఎంగా ఎన్టీఆర్ నిలిచారు.

సంబంధిత పోస్ట్