బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్య రోజూ కొడుతూ మానసికంగా హింసిస్తోందని సాఫ్ట్వేర్ ఇంజినీర్ విపిన్ గుప్తా ఈ నెల 4న తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి కనిపించకుండా పోయాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతడిని నోయిడాలో గుర్తించి బెంగళూరుకు రప్పించారు. భార్య వేధింపులు తట్టుకోలేక పారిపోయానని అతను చెప్పాడు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది.