పుచ్చను వేసవిలో సాగు చేస్తాం కావున నీటిని అందించడంలో నిర్లక్ష్యం వహించకూడదు. విత్తనం నాటిన వెంటనే నీటిని అందించాలి. 5-7 రోజులకు ఒకసారి నేల స్వభావాన్ని బట్టి నేల తేమ తగ్గకుండా నీటిని అందిస్తుండాలి. పుచ్చ పూత, కాత, కాయ ఎదుగుదల సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కాయలు పక్వానికి వచ్చే సమయంలో నీటిని అందించడం తగ్గించాలి.