బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వాకింగ్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలు విద్యుత్ స్తంభం కూలడంతో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడుకు చెందిన సుమతి, బీహార్‌కు చెందిన సోని కుమారి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. సోని 4 నెలల గర్భవతి. సోమవారం సాయంత్రం ఇద్దరూ బైయప్పనహళ్లి రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, ఒక జేసీబీ హఠాత్తుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగి ఇద్దరి మహిళలపై పడింది. వారు అక్కడికక్కడే మృతి చెందారు.