70 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా: రాష్ట్రపతి

53చూసినవారు
70 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా: రాష్ట్రపతి
పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వృద్ధులకు శుభవార్త చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తోందని తెలిపారు. అలాగే అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్