TG: ఫార్ములా-ఈ కారు రేసులో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు ముగిశాయి. మధ్యాహ్నం 2.30కి ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనేది అవాస్తవమని కేటీఆర్ తరఫు లాయర్ వాదించారు.