అమెరికా లాంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారతదేశంలో మాత్రం అంతకంటే పదేళ్ల ముందే వచ్చేస్తోంది. ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం కూడా గుండెపోటుకు కారణమవుతోంది. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ.. ఇలా ఏవైనా గానీ రోజుకు సగటున 8 నుంచి 10 గంటల వరకు చూస్తున్నారు. వీటన్నింటిని స్క్రీన్ టైం అనే అంటారు. పిజ్జాలు, బర్గర్లు, ఇతర మాంసాహార వంటకాలు దాదాపు రోజూ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. తద్వారా కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెపోటుకు కారణమవుతోంది.