పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) వల్ల మహిళల్లో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ''గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ'' ప్రకారం, భారత మహిళలల్లో మరణానికి గుండె సమస్యలు 17% పైగా ఉన్నాయి. జంక్ ఫుడ్ తినేవారికి.. నైట్ డ్యూటీలు చేసే మహిళలకు గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయని అధ్యయనం తెలిపింది. మహిళలు వ్యాయామం చేస్తూ.. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.