జపాన్‌లో సోమవారం భారీ
భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. ఇషికావా ప్రిఫెక్చర్ ప్రాంతం షింకన్‌సేన్ స్టేషన్‌లోని పార్క్ చేసిన కార్లు భూకంప ధాటికి ఊగిపోయాయి. అక్కడే ఉన్న కొందరు ప్రాణభయంతో నేలపై కూర్చుండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే వాజిమా ఓడరేవు వద్ద భారీ అలలు విరుచుకుపడ్డాయి.