శ్రీశైలం జలాశయానికి భారీ వరద

69చూసినవారు
శ్రీశైలం జలాశయానికి భారీ వరద
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం జూరాల నుంచి దాదాపు 3లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.40లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. ఈనెల 30న శ్రీశైలం గేట్లు తెరవనున్నారు.

సంబంధిత పోస్ట్