దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై మొత్తం వరదలతో నిండిపోయింది. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. గతంలో వర్షాలు పడినప్పుడు ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా చుట్టూ పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చి చేరాయి. గతంలో ఇలా జరిగింది.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కొందరు నెటిజన్‌లు సూచిస్తున్నారు.