కాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం

76చూసినవారు
కాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్‌, దుండిగల్‌, డబిల్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. కరీంనగర్‌, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కాసేపట్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్