భారీ వర్షం.. HYDలో ట్రాఫిక్ జామ్ (వీడియో)

76చూసినవారు
హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం అస్తవ్యస్తమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పైప్ లైన్ పనులకోసం ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పంజాగుట్ట, బేగంపేట, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంక్ బండ్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, కూకట్ పల్లిలో భారీ వర్షం కురిసింది. అబిడ్స్, మలక్ పెట్ లో చెరువులు రోడ్లను తలపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్