దేశ ఆర్ధిక రాజధాని ముంబై, పుణె అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ జీవితం స్తంభించిపోయింది. స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. కాగా డెక్కన్ జింఖానా ప్రాంతంలో నీటితో నిండిన వీధిలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అభిషేక్ ఘనేకర్, ఆకాష్ మానే, శివ పరిహార్ వీధి వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు.