పట్టపగలు నడిరోడ్డుపై వ్యక్తిని కర్రలతో దారుణంగా కొట్టారు (వీడియో)

52చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని చిన్న వివాదం కారణంగా ముగ్గురు వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టారు. కిందపడేసి విచక్షణారహితంగా కొట్టారు. కొట్టవద్దు ఎంత సేపు వేడుకున్నా వదల్లేదు. బాటసారులు కనీసం బాధితుడిని కాపాడకుండా చోద్యం చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్