ఏపీకి ‘రెమాల్’ తుఫాను హెచ్చరిక

41148చూసినవారు
ఏపీకి ‘రెమాల్’ తుఫాను హెచ్చరిక
నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీనికి ‘రెమాల్’ అని పేరు పెట్టారు. ఈ తుఫాను మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఏపీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్