హేమంత్ సోరెన్ బెయిల్ పిటిష‌న్ కేసు వాయిదా

70చూసినవారు
హేమంత్ సోరెన్ బెయిల్ పిటిష‌న్ కేసు వాయిదా
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. అయితే ఈ కేసులో వాద‌న‌ల‌ను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్ర‌భుత్వ హ‌యాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్ర‌మ లావాదేవీలు జ‌రిగాయి. ఆ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ చేప‌డుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని సోరెన్ కోరారు.

సంబంధిత పోస్ట్