మూడేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి (వీడియో)

17542చూసినవారు
యూపీలోని ముజఫర్‌నగర్‌‌లో ఇటీవల దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో ఓ వీధి కుక్క అటుగా వచ్చింది. అకస్మాత్తుగా వీధి కుక్క ఆ చిన్నారిపై దాడి చేసింది. కిందపడేసి కరిచింది. వెంటనే చిన్నారి తల్లి పరుగున అక్కడికి వచ్చింది. కుక్కను తరిమికొట్టి తన చిన్నారిని కాపాడింది. కుక్క దాడిలో గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్