హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్ కొట్టివేత

56చూసినవారు
హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్ కొట్టివేత
జార్ఖండ్ హైకోర్టులో రాష్ట్ర మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. అంతకుముందు ఫిబ్రవరి 22న పీఎంఎల్ఏ కోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో హేమంత్ సోరెన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్