‘హీరోలు పాన్ మసాలా యాడ్స్ చేయడం మానాలి’

85చూసినవారు
‘హీరోలు పాన్ మసాలా యాడ్స్ చేయడం మానాలి’
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్‌ఖాన్, అజయ్‌దేవ్‌గణ్, అక్షయ్‌కుమార్ పాన్ మసాలా యాడ్స్‌లో నటించడంపై టెలివిజన్ శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద చూపించే అక్షయ్‌కుమార్ ఇలాంటి వాటిల్లో నటించడం బాధించింది. షారుక్ సైతం ఇప్పుడు ఇదే బాటలోకి వెళ్లడం బాలేదు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఇలాంటి ప్రకటనల్లో యాక్ట్ చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్