ఆ పథకం కింద లబ్ది పొందాలంటే కార్డ్ లింక్‌ తప్పనిసరి: కేంద్రం

74చూసినవారు
ఆ పథకం కింద లబ్ది పొందాలంటే కార్డ్ లింక్‌ తప్పనిసరి: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో 'ఆయుష్మాన్ భారత్' ఒకటి. అయితే దీనిపై తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద లబ్ధిదారులకు కేటాయించిన గుర్తింపుకార్డుతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడితో లింక్ చేయాలని స్పష్టం చేసింది. అలా లింక్ చేసుకోకపోతే లబ్ది పొందలేరని వెల్లడించింది. కాగా, ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స పొందొచ్చు.

సంబంధిత పోస్ట్