ఢిల్లీలో హైటెన్షన్.. ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు

72చూసినవారు
ఢిల్లీలో హైటెన్షన్.. ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆప్ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ కార్యకర్తలు బయలుదేరారు. మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆప్, బీజేపీ పోటాపోటీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.

సంబంధిత పోస్ట్