ఇర్ఫాన్‌ పఠాన్‌పై ఐపీఎల్‌ కమిటీ వేటు?

51చూసినవారు
ఇర్ఫాన్‌ పఠాన్‌పై ఐపీఎల్‌ కమిటీ వేటు?
ఐపీఎల్ 2025 కోసం మేనేజ్‌మెంట్ తాజాగా కామెంట్రీ ప్యానెల్‌ను ప్రకటించింది. కానీ ప్యానెల్‌లో ఈసారి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరు లేకపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా, గతంలో ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ కమిటీకి పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి.  ఈ కారణంగానే పఠాన్‌ను పక్కన పెట్టి ఉంటారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్