TG: మెదక్ జిల్లాలోని మనోహరబాద్‌లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ముందస్తు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేల్చారు. దీంతో వేదిక కింద ఉన్న కార్పేటికి మంటలు వేగంగా అంటుకున్నాయి. గమనించిన కార్యకర్తలు మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.