మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జనవరి 5న దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని ఓ హాస్టల్‌లో తోటి వైద్యురాలిపై జూనియర్ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అశోక్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.