ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
By Pavan 67చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో 78,148.49 వద్ద స్థిరపడింది. నిఫ్టీ చివరకు 18 పాయింట్ల నష్టంతో 23,688 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి.