అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు అందరిని వణికిస్తోంది. ఇప్పటికే అనేక భవంతులు, వేలాది ఎకరాలు కాలి బూడిదవగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా ఈ మంటల్లో హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ (95) సజీవ దహనం అయినట్లు బంధువులు తెలిపారు. ఇంట్లో కాలిపోయిన అవశేషాలను కూడా అధికారులు గుర్తించారు. కాలిఫోర్నియాలోని అల్టాడెనాలోని ఆమె ఇల్లు కాలిపోగా ఇంటిలో అవశేషాలు గుర్తించారు.