స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, పలు ఆఫీస్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగం అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి తన ప్రసంగాన్ని అందించనున్నారు. దేశ పురోగతిని, అభివృద్ధిని.. ఈ స్వాతంత్య్రాన్ని మనకి తెచ్చి పెట్టి పోరాటయోధులను స్మరించుకుంటూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము.