పశువులలో గొంతువాపు వ్యాధి లక్షణాలు గుర్తించడం ఎలా?

76చూసినవారు
పశువులలో గొంతువాపు వ్యాధి లక్షణాలు గుర్తించడం ఎలా?
వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేది గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అంటారు. ఈ వ్యాధి సోకిన పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. జ్వరం తీవ్రత 104 -106 డిగ్రీల వరకు ఉంటుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ కారుతుంది. గొంతు పై భాగాన మెడ కింద వాపు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వెంటనే పశు వైదుడి వద్దకు తీసుకెళ్లాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్