సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను ఫాలోవర్స్, పేర్లలో తప్పులు, ఖాతా తెరిచిన తేదీ, ప్రొఫైల్ పిక్చర్ వంటి విషయాల ఆధారంగా గుర్తుపట్టవచ్చు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో సంస్థలు సెలబ్రెటీలు, కంపెనీలు, ప్రముఖులకు వెరిఫైడ్ అకౌంట్ బ్యాడ్జ్‌లు ఇస్తాయి. అలాగే, నకిలీ ఖాతాలకు ఎక్కువగా గూగుల్‌లో లభించే సాధారణ ఫొటోలు, సెలబ్రిటీల ఫొటోలు ఉంటాయి. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు కనిపించినప్పుడు రిపోర్టు చేయాలి.