గర్భనిరోధక మాత్రల్లో చాలా వరకు కాంబినేషన్ పిల్స్‌గానే లభిస్తాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్.. వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్లు కలగలిసిన ఈ మాత్రలు రెండు విధాలుగా గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి. అండోత్పత్తి సమయంలో అండం విడుదల కాకుండా చేయడంతో పాటు గర్భాశయం చుట్టూ ఉండే శ్లేష్మాన్ని చిక్కగా చేసి వీర్యం గర్భాశయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. వీటిని వైద్యుల సలహా మేరకు 21, 24, 28 రోజుల రుతుచక్రం ఉండే వారు రోజుకొకటి చొప్పున ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది.