కర్ణాటకలో గాలివాన విషాదాన్ని మిగిల్చింది. గాలివానకు భారీ రథం కూలిన ఘటనలో ఇద్దరు భక్తులు మరణించారు. బెంగళూరులోని దొడ్డనగమంగల గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. 150 అడుగుల భారీ రథాన్ని ఊరేగిస్తుండగా.. ఒక్కసారిగా నేలకొరగడంతో ఇద్దరు భక్తులు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.