తెలంగాణలోని 35 గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు ఆర్‌జేసీసెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గురుకులాల్లో MPC, BiPC, MEC గ్రూపులను ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమాలో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఎల్‌పీసెట్‌ను మే 20న నిర్వహించనున్నారు.