బెంగళూరులో గాలివానకు 150 ఫీట్ల ఎత్తు ఉన్న ఓ భారీ రథం నేలకొరిగింది. ఈ ఘటనలో ఓ భక్తుడు మృతిచెందాడు. హస్కూరులోని దొడ్డనగమంగల గ్రామంలో భక్తులు ఈ భారీ రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో బెంగళూరులో భారీ వర్షాలు, గాలులు వీస్తున్నాయి. దీంతో గాలివానకు రథం నేలకొరిగింది. రథం వెంట భక్తులు వేల సంఖ్యలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.