పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలు తారుమారు

57చూసినవారు
పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలు తారుమారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు తారుమారు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీలో ఎన్టీఆర్‌ జిల్లాలో ఇన్విజిలెటర్ల తప్పిదం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పదోతరగతి పరీక్షల్లో భాగంగా శనివారం మొదటి భాష పేపర్‌-2, ఓఎస్‌ఎస్సీ ప్రధాన భాష పరీక్షలలలో ఆరుగురు విద్యార్థులకు తారుమారుగా ఇచ్చారు. దీంతో, పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు అన్యాయం జరగకుండా మూల్యాంకనం చేసినప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్