AP: దేశవ్యాప్తంగా ఉన్న తపాలాశాఖ ఉద్యోగులకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుభవార్త చెప్పారు. తపాలాశాఖ ఉద్యోగులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నజరానాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. దేశంలో వీరిని నాలుగు రీజియన్లుగా విభజించి, టాప్ 5లో ఉన్న గ్రామీణ డాక్ సేవక్‌లకు నజరానాలు ఇవ్వనున్నారు. తపాలాశాఖ పరంగా ప్రజల అవసరాలు గుర్తించేందుకు 35 లక్షల కుటుంబాల్ని సర్వే చేయనున్నామని కేంద్రమంత్రి తెలిపారు.