భారీ అగ్ని ప్రమాదం.. రెండు పూరి గుడిసెలు దగ్ధం

85చూసినవారు
భారీ అగ్ని ప్రమాదం.. రెండు పూరి గుడిసెలు దగ్ధం
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోడేరు మండలం నాగులపల్లి తండాలో షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్