తెలుగు రాష్ట్రాల్లో భారీగా సొత్తు స్వాధీనం

554చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా సొత్తు స్వాధీనం
లోక్‌సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బంది పట్టుకున్నారు. కర్ణాటక, తెలంగాణ, గోవా నుంచి వస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా చెక్‌పోస్టుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణలో ఇప్పటివరకు రూ.20 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్