తెలంగాణ పామాయిల్ రైతులకు భారీ ఊరట లభించింది. రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తితో ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 - 27.5 శాతానికి కేంద్రం పెంచింది. గతంలో ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఆయిల్‌పామ్ గెలల ధర తగ్గడంతో రైతులు నిరాశ చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,400 ఎకరాల్లో పామాయిల్ తోటల నుంచి 2.80 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది.