పవన్‌ను టచ్ చేయని జగన్.. స్ట్రాటజీ మార్చారా?

72చూసినవారు
పవన్‌ను టచ్ చేయని జగన్.. స్ట్రాటజీ మార్చారా?
పిఠాపురంలో ఏలేరు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన జగన్.. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే సాహసం చేయలేదు. ఏలేరు వరదలకు చంద్రబాబే కారణమని చెప్పారు కానీ పవన్‌ను పల్లెత్తుమాట కూడా అనలేదు. ఎప్పుడూ పవన్‌పై దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్లంటూ విరుచుకుపడే జగన్.. ఈ సారి మాత్రం ఆయన గురించి మాట్లాడేందుకు ఎందుకు ఆసక్తి చూపలేదు. దాంతో జగన్ వ్యూహాత్మకంగానే పవన్‌ను పట్టించుకోలేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

సంబంధిత పోస్ట్