సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు

59చూసినవారు
సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు
అనకాపల్లి జిల్లా అనంతగిరి మండలం సరియా జలపాతంలో శనివారం ఇద్దరు పర్యాటకులు గల్లంతయ్యారు. విజయనగరం నుంచి వచ్చిన ఎనిమిది మంది పర్యాటకులు జలపాతంలో దిగారు. జలపాతంలో ఒకరు గల్లంతవ్వడంతో అతడిని కాపాడేందుకు మరోకరు వెళ్లి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్