ఎవరెస్ట్ శిఖరంపై భారీ ‘ట్రాఫిక్ జాం’

71చూసినవారు
రాజన్ ద్వివేది అనే ఔత్సాహికుడు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి.. తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో అతడికి భారీ క్యూలైన్ కనిపించింది. సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని గుర్తించి వీడియో తీశాడు. ఎవరెస్ట్ అధిరోహించడం జోక్ కాదు అని పేర్కొంటూ.. తనకు ఎదురైన వారిలో బహుశా 250 మంది మాత్రమే విజయవంతంగా శిఖరాన్ని చేరుకోగలరని పేర్కొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్